ఘ‌నంగా టీయుఎఫ్ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి జన్మదిన వేడుక‌లు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీయుఎఫ్ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్, హైదర్ నగర్ డివిజన్, మియాపూర్ డివిజన్, హఫీజ్ పేట్ డివిజన్, కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ డివిజన్ లలో టిపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బర్త్ డే కేక్ లు కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకరాళ్ళు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు, నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాళ్ళు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం అందరూ కలిసి మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చంద్ర గార్డెన్ లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు, నాయకుడు మధుయాష్కి గౌడ్ , స్పోర్ట్స్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ శివసేన రెడ్డి, నియోజకవర్గం నాయకులు, టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here