శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవం సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సేవలు అందిస్తున్న ప్రముఖ జే ఎన్ టి యు హెచ్ విద్యార్థినేత ఎరవెల్లి జగన్ కు ప్రతిష్టాత్మక శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్సెలెన్స్ అవార్డ్ -2025 ను ప్రదానం చేశారు. ఆక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్ లో నిర్వహించిన ఇంజనీరింగ్ డే దినోత్సవ వేడుకల్లో ఎరవెల్లి జగన్ కు భారతరత్న, మొట్ట మొదటి భారతదేశం ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్సెలెన్స్ అవార్డ్2025 ను అందజేశారు.

ఆక్ట్ ఫౌండేషన్ ఛైర్మెన్ మూర్తి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఇంజనీరింగ్ విద్యార్థి నేతగా ఎరవెల్లి జగన్ డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్, స్టూడెంట్ జేఏసీని స్థాపించి డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం అలుపెరుగని పోరాటం చేశారని, కరోనా కష్ట కాలంలో దాతల సహాయంతో ఎంతోమందికి నిత్యావసర సరుకులు అందజేశారని అన్నారు. 2016- 17 సంవత్సరంలో పూణే లో జరిగిన ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ప్రతినిధిగా హాజరై విద్యార్థుల సమస్యల పట్ల జాతీయ స్థాయిలో మాట్లాడినట్టు తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బి. ఆర్ అంబేద్కర్ స్మారక ప్రతిభ పురస్కార్ అవార్డ్ ను అందించిందని, హెచ్ఎంటీవీ సైతం విద్యార్థి నేతగా గుర్తించి ఇచ్చిన అవార్డ్, ట్రూ టీచర్స్ కోయలేషన్ రాష్ట్ర ఉత్తమ విద్యార్థి నాయకుడిగా అందించిన అవార్డులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతదేశం లెఫ్టినెంట్ కల్నల్ డా. కమలాకర్, మిసెస్ ఇండియా డా.శోభా, రామ్ దేవరావ్ హాస్పిటల్స్ సిఈవో డా. యోబు తదితరులు పాల్గొన్నారు.





