శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): అమెరికాలోని డల్లాస్‌లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) ఆధ్వర్యంలో బిజినెస్ ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రముఖ పరిశ్రామికవేత్త మిర్యాల రాఘవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఆయనను ఆప్త సభ్యులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. సమావేశంలో మిర్యాల రాఘవరావు వ్యాపార అవకాశాలపై తన అనుభవాలను పంచుకుంటూ భారత దేశంలో విస్తారమైన పెట్టుబడి అవకాశాలున్నాయన్నారు. హైటెక్, స్టార్ట్ప్, తయారీ రంగాలలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను పొందడమే కాకుండా ఉద్యోగ సృష్టికి దోహదపడుతుందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన కాటలిస్ట్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది యువ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకత లభించిందని, అలా ఏర్పడిన స్టార్టప్‌లు ఈరోజు విస్తరిస్తున్నాయని గుర్తుచేశారు. ఆప్త సభ్యుల సహకారంతో హైదరాబాద్‌లోనే ఒక ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేస్తే, అమెరికాలో ఉన్న తెలుగు వ్యాపార వేత్తలు, భారతదేశ పారిశ్రామికవేత్తల మధ్య సరళమైన అనుసంధానం ఏర్పడి అందరికీ మేలు జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆప్త అధ్యక్షుడు ఏలూరి నటరాజ్, బిజినెస్ ఫోరం కన్వీనర్ తేజ్ పాక్యాల, ఉమా శీతల, శ్రీని రావు శీలం, శరత్ కవి, సుబ్బు చెన్నం, బత్తుల సురేష్ చిలంకుర్తి పాల్గొన్నారు.






