దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్ లో క్రీడా పోటీలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి అసోసియేషన్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలోనీ దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి మెడల్స్, బహుమతులను ప్రదానం చేయడం జరిగిందని, దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడలను నిర్వహించి వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం పోటీలలో పాల్గొన్న వారిని ప్రోత్సహించి బహుమతులను అందజేయడం మంచి పరిణామం అని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడుసుమిల్లి సుధీర్, రాధాకిషన్, సురేంద్ర, మోహన్, ఉమాశంకర్, సుబ్బారావు, బాలాజీ వర్మ, శశి, రాజేష్, ధనుంజయ్, విజయ కృష్ణ, ప్రతిక్, అపార్ట్మెంట్స్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here