ప్రశాంతంగా గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ఓల్డ్ లింగంపల్లి విలేజ్ లో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జ‌న వేడుకల‌లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు, మతపరమైన ఘర్షణలకు పాల్పడవద్దని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, రాజు యాదవ్, శ్రీ గణేష్ యూత్ మెంబర్స్, సైదులు యాదవ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here