శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వరాలను సిద్ధింప చేసే వరసిద్ధి వినాయక నవరాత్రి వేడుకలు ఉత్సాహానికి, ఉజ్వల సాంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకలని గంగాధర్ రెడ్డి అన్నారు. యువత గణేశ మండపాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక నేతలు, భక్తులు, మహిళలు, కాలనీ వాసులు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






