క‌ల్లుగీత కార్మికుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాలి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క‌ల్లుగీత కార్మికుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆ సంఘం నాయ‌కులు మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నివాసంలో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ 25 శాతం వైన్స్ ను కల్లుగీత సొసైటీలకు ఇవ్వాలని అన్నారు. లేదంటే ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. అలాగే నందనం నీరా ప్రాజెక్టును సందర్శిస్తామ‌ని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మస్థలం కిలాషా పూర్ కు కార్ల ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని స‌మావేశంలో నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. దుర్గయ్య గౌడ్, కల్లు దుకాణాల రక్షణ కమిటీ నాయకుడు సురేష్ గౌడ్, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేశ్వర్ గౌడ్, గౌడ కలుగీత వృత్తిదారుల సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కేశమోని శ్రీనివాస్ గౌడ్, మూల మనోహర్ గౌడ్, చింతల్ బస్తీ అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here