శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): పార్లమెంట్ రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని అన్నారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య రంగాల్లో న్యాయం చేయాలంటే వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక్కటే సరైన నిర్ణయమని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, యువత కార్యదర్శి చిన్న శ్రీశైలం యాదవ్, శివ గౌడ్, వెంకటేష్ గౌడ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, బిసి నాయకులు యాదగిరి యాదవ్, సాయిలు యాదవ్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






