కృష్ణ సాయి ఎనక్లేవ్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎనక్లేవ్ కాలనీ వాసులు కాలనీలో నెల‌కొన్న పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ సాయి ఎనక్లేవ్ కాలనీలో తలెత్తిన సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మ‌న్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డ్రైనేజీ, మంచినీటి కొరత సమస్యలను విడతల వారిగా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ కె, కృష్ణ చారి, సాయి బాబు, వీరేందర్, బివిఎన్ ప్రసాద్, వెంకట్ రెడ్డి, శ్రీధర్, సురేందర్‌నాథ్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here