శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శారదానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, లేక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట మంజీరా పైప్‌లైన్ రోడ్డు సమీపంలో ఉన్న వాసవి కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయం ఎదుట స్థానికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, లేక్ సిటీ రోడ్డు గుంతలమయంగా మారి ధ్వంసం అయిన నేపథ్యంలో రోడ్డుకు గాను మరమ్మత్తులు నిర్వహిచాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మియాపూర్ పోలీసులు కలగజేసుకుని కాలనీవాసులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డుకు మరమ్మత్తులను నిర్వహించని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.






