శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సంక్షేమ,సేవా కార్యక్రమాలలో ఆర్ కేవై టీమ్ సభ్యులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ మసీద్ బండ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆర్‌కేవై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురికి రవికుమార్ యాదవ్ ఉచితంగా గొడుగులను పంపిణీ చేశారు. అనంతరం పలువురు యువకులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గొడుగుల పంపిణీకి శ్రీకారం చుట్టిన గుండె గణేష్ ముదిరాజ్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆర్‌కేవై టీమ్ సభ్యులు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను లేదా తన టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ , రాజేష్ గౌడ్, జె.శ్రీనివాస్, శివరాజ్, పాపయ్య, పవన్,రాహుల్, హరి, నిష్కల్, వికాస్, జిహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.






