ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యంగా ఉండేలా రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల‌ను అందుబాటులోకి తేనున్నామ‌ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ జిపిఆర్ క్వార్టర్స్ వద్ద బాలాజీ గ్రౌండ్స్ లో శేరిలింగంపల్లి అభివృద్ధికి బాటలు వేస్తూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మంత్రివర్గ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేట‌ర్లు రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో రిజిస్ట్రార్ భవన సముదాయలు అన్ని హంగులతో చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేక పేద మధ్య తరగతి కుటుంబాల నుండి ప్రతిఒక్కరూ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వస్తే చేదు అనుభవం ఎదురుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని వాటిని అధిగ‌మించి ప్రజా పాలనలో భాగంగా ఫైవ్ స్టార్ హోటల్ హోదాలో అన్ని సదుపాయాలతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపు నిర్మాణ పనులు పూర్తి చేసి రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించుకుంటామని హామీ ఇచ్చారు. అందుకు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కృషి చేయాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, నాయకురాళ్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here