శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ నాలుగో ఫేజ్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడు, గోపిక వేషధారణలలో చిన్నారులు అలరించారు. గీతాంజలి మోడల్ హై స్కూల్ విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలలో అలరించారు. దూదేకుల షఫీక్ రెహమాన్ ఎంతగానో ఆకర్షణగా నిలిచాడు. అదేవిధంగా గోపికల వేషధారణలో చోటి, మెహ్రూక్ ఉన్నిసా బేగం, హరిని సాయి, భవ్య ఎంతగానో అలరించారు. వారు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.






