శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పరిధిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ గజార రావు భూపాల్, డీసీపీ రంజన్ రతన్ కుమార్, అడిషనల్ డీసీపీ వీరన్న, ఏసీపీ వెంకటయ్య తదితరులు మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌లో ఉన్న కోర్ట్ రూమ్, ప్రాపర్టీ రూమ్, వుమెన్ బ్యారక్, ఎస్ఐల వర్క్ స్టేషన్ తదితర విభాగాలను వారు పరిశీలించారు.






