శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ ప్రకాష్ నగర్ లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు ఆయన ఆలయ కమిటీ సభ్యులకు రూ.50వేలను అందించారు. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అఉంటాయని రామకృష్ణ గౌడ్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చింతకింది పవన్ గౌడ్, రాజారాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






