శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో డీసీ శశిరేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పార్టీ బీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,69,000 ఓట్లు ఉన్నాయి కానీ ఇందులో ERO అధికారులు BLA లను నియమించి ప్రాథమికంగా ప్రతి ఇంటికి తిరిగి పరిశీలిస్తే దాదాపు 2,50,000 వేల ఓట్లు తగ్గుతాయని అంచనా వేశారు. మియాపూర్ డివిజన్లోని బూత్ no 343 H no 1 – 67/5 లో ఒకే ఇంట్లో దాదాపు 145 ఓట్లు ఉన్నాయన్నారు. ఇలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో పార్ట్ టైం లో సరైన విధంగా పరిశీలిస్తే ఓట్లు తగ్గుతాయని, డూప్లికేట్ ఓట్లు అన్ని తగ్గుతాయని, బూత్‌ల సంఖ్య కూడా తగ్గి ఎలక్షన్ కు అధికారులకు పని తగ్గుతుందని అన్నారు. దీంతో ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుందని, అన్ని పార్టీలకు కూడా పని తగ్గుతుందని, దీనిపై పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.






