ఉషోదయ ఎన్‌క్లేవ్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 10 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్‌క్లేవ్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఉషోదయ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర‌చాలని, అవసరమున్న చోట UGD పైప్ లైన్లు వేయాలని, వరద నీటి కాల్వ నిర్మాణం చేపట్టాలని , వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే ఉషోదయ ఎన్‌క్లేవ్ కాలనీలో పర్యటిస్తానని, ఉషోదయ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే అవసరమున్న చోట రోడ్లను, UGD పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తామని, వరద నీటి కాలువ‌ నిర్మాణం చేపడుతామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here