శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్‌క్లేవ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ్ సాయి మోటార్స్ ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని BK ఎన్‌క్లేవ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ్ సాయి మోటార్స్ ను ప్రారంభించడం జరిగిందని, ప్రేమ్ సాయి మోటార్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కస్టమర్లకు నమ్మకంగా అనుగుణంగా మంచి సేవలను అందజేస్తూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని సూచించారు. కస్టమర్ల ఆదరణ అభిమానం పొందిన ప్రతి వ్యాపారస్తుడు అగ్రస్థానంలో వుంటాడని కార్పొరేటర్ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాయి మోటార్స్ యజమానులు శ్రీనివాస్, వెంకట్, కొడదల ప్రతాపరెడ్డి, ఎంసీ రెడ్డి, సోమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






