శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): రక్షాబంధన్ ను పురస్కరించుకొని మియాపూర్ లోని శ్రీ చైతన్య మహిళా కళాశాలలో AIFDS నాయకులు విద్యార్థినిలతో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థినిలతో వారు రాఖీలను కట్టించుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, నాయకులు అరుణ్, వంశీ పాల్గొన్నారు.






