శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతం చేస్తుందన్నారు. సమాజంలోని వ్యక్తులు కలసి మెలసి మెలిగేందుకు, సోదర భావంతో ఉండేందుకు, ఒకరి పట్ల మరొకరు జాలి, దయ, అనురాగం, ప్రేమ వంటివి కలిగి ఉండేందుకు రాఖీ పండుగ తోడ్పడుతుందన్నారు. ప్రజలందరూ ఈ పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటూ మత సామరస్యం పాటిస్తారని అన్నారు. సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






