శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఏఎస్‌వైఎఫ్ వ్యవస్థాపకుడు రోహిత్ ముదిరాజ్ అన్నారు. శేరిలింగంపల్లిలోని చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటే సమాచారం తెలుసుకున్న ఆయన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడికి రక్తదానం చేశారు. దీంతో బాధితుడి శస్త్ర చికిత్స విజయవంతం అయిందన్నారు. ఈ సందర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే అనేక ప్రాణాలను కాపాడిన వారు అవుతారని అన్నారు.






