అపర్ణ సైబర్ జోన్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌

శేరిలింగంపల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ వాసుల‌తో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమావేశమై ఎక్కడ ఉన్నా సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీలో చెత్త సేకరణ పనులు నిబంధనల ప్రకారం ప్రతి రోజు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య పనులు క్రమబద్ధంగా కొనసాగేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీరీష, ఏఎంఓ హెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎఈ రషీద్, అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ లలిత్ చౌదరి, రాజీవ్ సింగ్, సిద్ధార్థ్ రెడ్డి, జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది, సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, శేఖర్, సుమన్, తిరుపతి, రాజు, గోవింద్, చందు, ప్రకాశ్, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here