జూలై 23న జ‌ర‌గ‌నున్న విద్యాసంస్థ‌ల బంద్‌ను విజ‌య‌వంతం చేయండి: ఏఐఎస్ఎఫ్

శేరిలింగంపల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల్ కౌన్సిల్, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వ‌ర్యంలో జూలై 23న‌ రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాల‌ని శేరిలింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు నితీష్, ధర్మ తేజ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, శిథిలావస్త‌లో ఉన్న ప్రభుత్వ విద్యాలయాలను నూతన నిర్మాణం చేపట్టాలని, సొంత హాస్టల్ భవనాలను నిర్మించాలని, విద్యాహక్కు చట్టాన్ని ప్రయివేట్ కార్పోరేట్ విద్యాసంస్థలలో అమలు పరచాలనీ , 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని , పూర్తిస్థాయిలో ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here