న్యూ కాలనీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జలమండలి అధికారులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సంధర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ కాలనీలో పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి అధికారులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి పాదయాత్ర చేయడం జరిగింద‌ని, న్యూ కాలనీలో తలెత్తిన సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగింద‌ని అన్నారు. కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, న్యూ కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈ ఈ ఇందిరాబాయి, డి ఈ దుర్గా ప్రసాద్, జలమండలి డీజీఎం నారాయణ, మేనేజర్ సునీత, ఏ ఈ సంతోష్, కాలనీ వాసులు లక్ష్మయ్య గౌడ్, లావణ్య, నరేష్ నాయక్, కృష్ణ నాయక్, శంకర్ నాయక్, సాంబయ్య, తిమ్మరాజు, వెంకటేష్ నాయక్, దుర్గేశ్, జ్యోతి, రాజేశ్వరి, వరలక్ష్మీ, నీలా రమేష్, ప్రీతం గౌడ్, పవన్ కుమార్, రాజు, లక్ష్మణ్ నాయక్, లక్ష్మీ నగర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here