జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మొక్క‌లు నాటిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, జూలై 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లోని జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో కొమరగౌని ఫౌండేషన్ నిర్వహించిన డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలకు విద్యార్థులు కూర్చునే బెంచీలు అందించడం, పలు మరమ్మత్తు పనులను చేయించడం జరిగింద‌న్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం లో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కొమరగౌని ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్, నితీష్ గౌడ్, మణి తేజ గౌడ్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల, హై స్కూల్ హెడ్ మాస్టర్ రాజశేఖర్ రెడ్డి, గాలి నరహరి, ఈశ్వరయ్య, లక్ష్మణ్ యాదవ్, నవీన్ యాదవ్, సత్యనారాయణ, భారతమ్మ, కిషోర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here