హఫీజ్ పేట టిడిపి అభ్యర్థి అవకాశం కోసం షేక్ నస్రీన్ అస్లాం వినతి

టిడిపి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు సుభాష్ యాదవ్ కు వినతిపత్రం సమర్పిస్తున్న షేక్ అస్లాం

హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట డివిజన్ టిడిపి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ స్థానిక టిడిపి నాయకుడు షేక్ అస్లాం టిడిపి రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు. డివిజన్ లో రిజర్వేషన్ మహిళలకు కేటాయించడం తో తన భార్య షేక్ నస్రీన్ అస్లాంకు టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం టిడిపి చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ సుభాష్ యాదవ్ కు బయోడేటా ను సమర్పించారు. ఎన్నో ఏళ్ళు గా టిడిపి లో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లు అస్లాం తెలిపారు. తనకు అవకాశం కల్పిస్తే హఫీజ్ పేట్ డివిజన్ లో టిడిపి జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భానుప్రసాద్, నాయకులు వెంకటేష్ గౌడ్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here