
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ గచ్చిబౌలి డివిజన్ కోర్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి డివిజన్ ఎన్నికల ఇంచార్జ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభ్యర్థి ఎవరైనా గచ్చిబౌలి డివిజన్ లో బిజెపి విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వసంత్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, మట్టా సురేష్, నక్క నరేందర్ గౌడ్, నీలం రవిందర్ ముదిరాజ్, మూల అనిల్ గౌడ్, మహెందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





