స‌మాన‌త్వం కోసం మ‌హిళ‌లు ఉద్య‌మించాలి: శివాని

శేరిలింగంపల్లి, మార్చి 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ లోని నడిగడ్డ తండాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా అఖిలభారత ప్రజాతంత్రం మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు దేవనూరు లక్ష్మి అధ్యక్షతన స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి శివాని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాలను వేడుకలకు పరిమితం చేస్తూ కేక్ కటింగ్ లు చీరల పంపిణీలు కొద్దిమంది మహిళలకు శాలువాలు కప్పి సన్మానాలు సత్కరించడంతో ముగుస్తుంద‌న్నారు. ప్రతీ ఏటా ఇదే తంతు కొన‌సాగుతుంద‌ని, మహిళా దినోత్సవం అంటే కేవలం సంబరం మాత్రమే కాదు అది సమానత్వం కోసం సాగిన సమరమే అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా గుర్తించాలి. పని గంటలు తగ్గాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అంగడి పుష్ప, మహిళా నాయకులు డి లక్ష్మి, గౌసియా బేగం, కైరునిషా బేగం, ఇందిరా, రాణి, మనుష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here