- సైబరాబాద్ కమిషనరేట్లో అందజేసిన సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే పోలీసులు తమ సేవలను అలాగే కొనసాగించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు 2019వ సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలను అందించిన పోలీసులకు సీపీ సజ్జనార్ కేపీఐ రివార్డులను, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ పోలీసులను అభినందించారు. పోలీసులు ఇలాగే ఉత్తమ ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ వెంకటేశ్వర్లు, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, ఏడీసీపీ క్రైమ్స్-1 కవిత, ఏడీసీపీ క్రైమ్స్-2 ఇందిర పాల్గొన్నారు.







