కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు అబ్బుల కృష్ణా గౌడ్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మంగళవారం తన బయోడేటాను సమర్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొండాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ గాంధీకి కృష్ణ గౌడ్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్బుల కృష్ణా గౌడ్ సతీమణి అబ్బుల సక్కుబాయి, మహిళా మండలి నాయకురాలు శ్రీదేవి, కార్యదర్శి బలరాం యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ తిరుపతి యాదవ్, యూత్ ప్రెసిడెంట్ వి. వి రావ్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.






