హోప్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప‌లువురికి స‌హాయం

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్‌ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పేద మహిళలు రమ్య, విమలమ్మ, ప్రసున్న, రమణి, ఉమ‌, ఇద్దరు వికలాంగులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేశారు. అలాగే శేరిలింగంపల్లి డివిజన్ గోపి నగర్ కి చెందిన సర్వేశ్వర్ రావు అనే వ్య‌క్తి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 వేల‌ను కూడా వారు అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. కొండా విజయ్ కుమార్ సామాజిక కార్యక్రమాలు చేస్తుండ‌డం అభినందనీయమని అన్నారు. పేద‌ల‌కు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కొండా విజయ్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ పాల్గొన్నారు.

మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్ల‌ను అంద‌జేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్
సర్వేశ్వర్ రావు కుటుంబానికి రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్
కుంగ్ ఫు మాస్ట‌ర్ బ‌షీర్ అలీ ఖాన్‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్

కుంగ్ ఫు మాస్ట‌ర్‌కు స‌హాయం…
చందానగర్ డివిజన్ కి చెందిన బషీర్ అలీ ఖాన్ అనే కుంగ్ ఫు మాస్టర్ కి కుంగ్ ఫు విద్య సాధనకై అవసరమయ్యే మెటీరియల్ కొనుగోలుకై హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేల చెక్కును ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here