కొత్త‌గూడ విలేజ్‌లో స్థానికుల‌తో కార్పొరేటర్ హమీద్ పటేల్ స‌మావేశం

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని కొత్త‌గూడ విలేజ్ లో ఉన్న సమస్యలు, చేసిన అభివృద్ధి పనులపై స్థానికుల‌తో క‌లిసి కార్పొరేటర్ హమీద్ పటేల్ మంగ‌ళ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో భాగంగా గతంలో జరిగిన పనులు, ఇంకా చేయ‌వలసిన అభివృద్ధి పనుల‌పై చ‌ర్చించారు. కొత్తగూడ కమ్యూనిటీ హాల్ కు కావలసిన విద్యుత్‌, తాగునీరు త‌దిత‌ర వ‌స‌తుల‌తోపాటు కమ్యూనిటీ హాల్ పునరుద్దరణ పనులను చేప‌ట్టాల‌ని స్థానికులు కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకువ‌చ్చారు. కొన్ని చోట్ల అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ‌ల్ల ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని, సీసీ రోడ్ల‌ను నిర్మించాల‌ని స్థానికులు కోరారు. అలాగే కొత్త‌గూడ విలేజ్ లోని చెరువును శుభ్రం చేయిస్తే బ‌తుక‌మ్మ వంటి పండుగ‌ల‌కు ఉప‌యోగంగా ఉంటుంద‌ని అన్నారు. చెరువు సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని స్థానికులు కార్పొరేట‌ర్‌ను కోరారు. అనంతరం కార్పొరేటర్ హమీద్ పటేల్ బస్తీలో పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొత్త‌గూడ విలేజ్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్

ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. కొత్తగూడ విలేజ్ లో ఎన్నో సమస్యలను దశల వారీగా పరిష్క‌రిస్తూ వస్తున్నామని, ఇంకా చేయ‌వలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, త్వరలోనే మిగిలిన సమస్యలను ప‌రిష్క‌రించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. కొత్తగూడ విలేజ్ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ పునరుద్దరణ పనులు, చెరువు సుందరీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అంతర్గత రోడ్లను యుద్ధప్రాదిపదికన పూర్తి చేయిస్తామని అన్నారు. కొత్తగూడ విలేజ్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

కొత్త‌గూడ విలేజ్ వాసుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్

వార్డు మెంబర్ జంగం గౌడ్, ఎన్.లక్ష్మీనారాయణ, ఎన్. లక్ష్మణ్, ఖాసీం, కుమార్, మతీన్, జగదీష్, అజామ్, అంజి, గోపి, మఖ్బుల్, ఇలియాజ్, ఇర్ఫాన్, సాజిద్, కాశి రెడ్డి, నయీమ్, జానీ, షఫీ, ఫయాజ్, సురేంద్ర, విజయ్, వినోద్, గౌస్ భాయ్, ఆనంద్, ప్రభాకర్, నర్సింగ్ రావు, శివ, రామ్ ప్రసాద్, నిఖిల్, అజయ్, గణేష్, జ్ఞానీ, వెంకటేష్, నవీన్ గౌడ్, కె. రాజు, మహేష్, ఎన్. రఘు, అజాస్, మహ్మద్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here