మంజీర మెట్రో ట్రాన్స్ మిషన్ ఫేజ్‌ 2 పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయండి: కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మంజీర మెట్రో ట్రాన్స్ మిషన్ ఫేజ్‌ 2 పైప్ లైన్ పనుల‌ను త్వరగా పూర్తి చేయాల‌ని కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి అధికారుల‌కు సూచించారు. చందానగర్ డివిజన్ ప‌రిధిలోని దీప్తిశ్రీ నగర్ (మదీనాగూడ) వద్ద సోమ‌వారం అర్ధరాత్రి మంజీరా మెట్రో ట్రాన్స్‌మిషన్ ఫేజ్‌ 2 పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోయింది. దీంతో మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్ తదితర అపార్ట్‌మెంట్‌ల‌లోకి నీళ్ళు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో స్థానికులు ఫిర్యాదు చేయ‌డంతో కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆయా ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. అనంత‌రం కార్పొరేటర్ మాట్లాడుతూ రాత్రి 2.30 గంటలకు మంజీరా మెట్రో ట్రాన్స్‌మిషన్ ఫేజ్‌ 2 పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవటంతో మహాలక్ష్మి ఆర్కేడ్ తదితర అపార్ట్‌మెంట్ ల‌లో సెల్లార్ లలోకి నీరు వ‌చ్చింద‌ని అన్నారు. దీంతో ఆ నీటిని తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించిన‌ట్లు తెలిపారు. అలాగే మంజీరా మెట్రో ట్రాన్స్‌మిషన్ ఫేజ్‌ 2 పైప్ లైన్ పనుల‌ను పూర్తి చేసి అపార్ట్‌మెంట్ వాసులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

అపార్ట్‌మెంట్‌ల వ‌ద్ద చేరిన నీటిని ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి
మోటార్ స‌హాయంతో నీటిని తొలగించే ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here