శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): AICC పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నర్సింహా రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుమహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఛలో రాజభవన్ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్ పాల్గొన్నారు. రూ.20,000 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడిన అదానీ పై కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మనీ లాండరింగ్ కింద కనీసం నోటీసులు ఇవ్వకపోవడం అంటేనే మోదీ ప్రభుత్వం అదానీని కాపాడుతున్నారని దేశప్రజలకు అర్ధమవుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాగొన్నారు.