- కాలనీలు, బస్తీల్లో పాలాభిషేకాలు
చంగానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు ఆస్తి పన్నులో రాయితీలు కల్పించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.3000 వేతనం పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ చందానగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్ వాసులు సంబురాలు జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
డివిజన్ పరిధిలోని భవానిపురం, విద్యా నగర్, శంకర్ నగర్, అన్నపూర్ణ ఎన్క్లేవ్, భవానీ శంకర్ నగర్, భవానిపురం వీకర్ సెక్షన్, వేమన వీకర్ సెక్షన్, న్యూ శంకర్ నగర్, కైలాష్ నగర్, జవహర్ కాలనీ, సురక్ష ఎన్క్లేవ్, సురక్ష హిల్స్, కైలాష్ వీకర్ సెక్షన్, వేముకుంట, శుభోదయం కాలనీ, టెలీఫోన్ కాలనీ, ఇందిరా నగర్, పద్మజ కాలనీలలో ప్రజలు సంబురాలు జరుపుకున్నారు.