శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన 11వ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు సత్తాచాటారు.
శేరిలింగంపల్లి మాతృశ్రీ నగర్ కు చెందిన ముగ్గురు యువ ప్రతిభావంతులు రామినేని రోహన్ (63 కేజీల క్యాడెట్ విభాగంలో స్వర్ణం), విశాల్ రెడ్డి అమ్రాది (57 కేజీల క్యాడెట్ విభాగంలో కాంస్యం), తాళపత్రి ఆరాధ్య (42 కేజీల విభాగంలో కుమిటేలో బంగారు పతకం) పతకాలతో భారత కీర్తి పతాకాలను రెపరెపలాడించారు. ఈ సందర్భంగా రేయాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక చైర్మన్, కోచ్ నరేష్ ముదావత్ ఒక ప్రకటనలో వివరాలు వెలిలడించారు.