పారిశుధ్య కార్మికుల సంబరాలలో కలివేముల వీరేశం గౌడ్

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియెజకవర్గం నెహ్రూనగర్, గోపీనగర్ ల‌లో పారిశుధ్య కార్మికులు ఆదివారం నిర్వ‌హించిన‌ సంబరాల్లో తెరాస సీనియర్ నాయకుడు కలివేముల వీరేశం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల వేతనం పెంచడం హ‌ర్ష‌ణీయ‌మ‌ని, ఇందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ తాము బతికి ఉన్నన్ని రోజులు కేసీఆరే త‌మ‌కు ముఖ్యమంత్రిగా ఉండాల‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సత్యనారాయణ గౌడ్, కొండకల్ శ్రీనివాస్ గౌడ్, కె.సంతోష్ కుమార్, నవీన్ గౌడ్, కుమార్, నర్సింహులు, వెంకటేష్ గౌడ్, కాలనీ వాసులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన కలివేముల వీరేశం గౌడ్, పారిశుధ్య కార్మికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here