చందాన‌గ‌ర్‌లో పారిశుద్ధ్య కార్మికుల సంబురాలు

  • సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పారిశుద్ద్య కార్మికులకు రూ.3000 వేతనం పెంచినందుకు చందానగర్ లోని గాంధీ విగ్రహం వద్ద పారిశుధ్య కార్మికులతో కలసి కార్పొరెటర్ బొబ్బ నవత రెడ్డి ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు, ఎంటమాల‌జీ సిబ్బందికి రూ.3వేల వేత‌నం పెంచ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని, దీంతో కార్మికుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంద‌ని అన్నారు. తాజా వేత‌న పెంపుతో క‌లిపి ఇప్ప‌టికే కార్మికుల‌కు 3 సార్లు వేత‌నం పెంచ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా పారిశుధ్య కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పారునంది శ్రీకాంత్, గోవర్ధన్ రెడ్డి, చందర్ రావు, సలీం, పోచయ్య, రామారావు, రాధిక, రైసా, వరలక్ష్మి, అనంత రెడ్డి ,అఖిల్, ధన్ రాజ్ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న కార్పొరెటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here