మెరుగైన విద్యాబోధ‌న‌కు స‌ర‌స్వ‌తి విద్యా మందిర్ మారుపేరు: మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రమశిక్షణ, మెరుగైన విద్యా బోధనను అందించడంలో సరస్వతి విద్యా మందిర్ పాఠశాలల యజమాన్యం ముందంజలో ఉన్నారని మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ కొనియాడారు. పేద విద్యార్థినీ, విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో మా సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ట్రస్ట్ సెక్రటరీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఆ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్, ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చందానగర్ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థినీ విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర ప్రసాద్, నవతారెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్, రాజు శెట్టి, రామచందర్, వెంకటస్వామి రెడ్డి, రమణయ్య, శ్రీనివాస్ యాదవ్, సీతారామరాజు, రాజేష్, సత్యనారాయణ రాజు, క్రాంతి, ప్రభాకర్ పాల్గొన్నారు.

విద్యార్థుల‌కు నోట్ పుస్త‌కాల‌ను పంపిణీ చేస్తున్న భిక్ష‌ప‌తియాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here