ఆసుపత్రి అంటే భయం కాదు.. భరోసా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 12 ఏళ్ల క్రితం నాకు హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలితే కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి డాక్టర్ నేను బతకడం కష్టమని చెప్పారు. కానీ ఇక్కడున్న డాక్టర్ శరత్ నాకు ప్రోణం పోశారు. మళ్లీ పునర్జన్మ ఇచ్చారు.. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ లోని సైబర్ గేట్ వద్దనున్న మెడికోవర్ ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి ఆసుపత్రి యాజమాన్యం నూతనంగా ప్రవేశపెట్టిన మెడికోవర్‌ ఫ్యామిలీ కార్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ కృష్ణ ప్రసాద్, హరికృష్ణ, బుల్లితెర హీరో శ్రీరాం హాజరయ్యారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. యూరప్ లో పాపులర్ ఆసుపత్రి మెడికోవర్. నాకు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ శరత్ రెడ్డితో సన్నిహిత సంబంధముంది. నేను ఆయన పేషెంట్ నే. ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం డాక్టర్ శరత్, డాక్టర్ సాహు. భారత్ లోని 16 నగరాల్లో 23 ఆసుపత్రులున్నయ్. 1200 మంది డాక్టర్లు, 13 వేల మంది ఉద్యోగులున్న ఈ ఆసుపత్రిలో కోటి మందికిపైగా రోగులకు ఇప్పటి వరకు వైద్య సేవలందించడం గొప్ప విషయం.

మెడికోవ‌ర్ ఫ్యామిలీ కార్డును ఆవిష్క‌రిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజ‌య్

దురదృష్టమేందంటే చాలా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నరు. ఎందుకంటే ఆసుపత్రి బిల్లులు భరించలేనంతగా ఉన్నాయి. తొలుత ఆసుపత్రిలో చేరినప్పుడు ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చయితదని చెబుతారో… డిశ్చార్జ్ అయ్యే నాటికి అంతకు ఐదారు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులంటే భయపడే పరిస్థితి ఉన్న ఈరోజుల్లో భయం వద్దు, ఆసుపత్రి అంటే భరోసా కల్పించేలా మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డును మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ఈ కార్డు తీసుకున్న కుటుంబ సభ్యులందరికీ 15 నుండి 50 శాతం వరకు ఆసుపత్రి బిల్లులో డిస్కౌంట్ ఇస్తుండటం శుభపరిణామం. ఆసుపత్రికి భారమైనప్పటికీ రోగులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా.. అని అన్నారు.

ఆసుపత్రి సీఎండీ, డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండి సంజయ్ కష్టపడి పైకొచ్చిన నాయకుడు. మాస్ లీడర్. అన్నింటికంటే గొప్ప మానవతావాది. మా ఆసుపత్రిలో చాలా మంది పేషెంట్లకు తనే మొత్తం బిల్లు చెల్లించి వైద్యం చేయించారు. ఎంతో మందికి సాయం చేసే వ్యక్తి. తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా సాయపడాలనే తపన కలిగిన వ్యక్తి బండి సంజయ్. ఆయన చేతుల మీదుగా మెడికోవర్‌ ఫ్యామిలీ కార్డును ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.. అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here