శేరిలింగంపల్లి, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్ లో కాలనీలోని సగర సంఘం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ రోజా దేవి రంగారావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని కులాల అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, నిబద్దత క్రమశిక్షణకు మారుపేరైన సగరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతాన తెలియజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సగర కులస్తులతో తనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పాటు నిబద్దతతో సగర కులస్తులు వ్యవహరిస్తూ ఉంటారన్నారు. మిగతా కుల సంఘాలకు సగర సంఘం వారు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
జగద్గిరిగుట్ట సగర సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కాని శ్రీనివాస్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు, సగర ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆస్కాని మారుతి సాగర్, జగద్గిరిగుట్ట సగర సంఘం అధ్యక్షుడు ఆస్కాని కొండయ్య సాగర్, కోశాధికారి కొమ్ముల రాజేష్ సాగర్, సగర సంఘం రాష్ట్ర నాయకులు కే పి రామ్ సాగర్, రమేష్ సాగర్, కె.పి రాములు సాగర్, ఎం రాములు సాగర్, జి సత్యనారాయణ సాగర్, గౌరవ సలహాదారులు, సగర మహిళా సంఘం అధ్యక్షురాలు జి కుసుమసాగర్, కోశాధికారి సిహెచ్ జ్యోతి సాగర్, వార్డు కమిటీ సభ్యులు చంద్రమోహన్ సాగర్, యువజన సంఘం అధ్యక్షుడు ఎం మురళి సాగర్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ శేఖర్ సాగర్, కోశాధికారి సంపత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.