శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన రూబీనా బేగం వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.60వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మారబోయిన రాజు యాదవ్, చింత కింది రవీందర్ గౌడ్, ప్రసాద్, కాశీనాథ్ యాదవ్, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, రాజు యాదవ్, శశాంక్, పవన్, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.