యాక్సిడెంట్‌లో గాయాల పాలై చికిత్స పొందుతూ యువ‌కుడి మృతి

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం క‌ర్నూలు జిల్లాకు చెందిన బోయ శ్రీ‌నివాస్ (20) కుటుంబం 20 ఏళ్ల కింద‌ట న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చి శేరిలింగంప‌ల్లిలోని న‌ల్ల‌గండ్ల గుల్‌మోహ‌ర్ పార్క్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. బోయ శ్రీ‌నివాస్ స్థానికంగా ఎల‌క్ట్రిష‌య‌న్‌గా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు.

మృతుడు బోయ శ్రీనివాస్(ఫైల్)

కాగా ఈ నెల 16వ తేదీన అదే కాల‌నీకి చెందిన స‌తీష్ అనే త‌న స్నేహితుడి బ‌ర్త్ డే వేడుక‌ల్లో శ్రీ‌నివాస్ పాల్గొన్నాడు. అనంత‌రం రాత్రి స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీ‌నాథ్‌కు చెందిన ఆటోలో డిన్న‌ర్ చేసేందుకు గ‌చ్చిబౌలి వైపు వెళ్తున్నారు. కాగా ఆటో న‌డుపుతున్న శ్రీ‌నాథ్ నిర్లక్ష్యంగా వేగంగా ఆటోను న‌డిపించడంతో అదుపు త‌ప్పి గుర్తు తెలియ‌ని డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో శ్రీ‌నివాస్‌కు తీవ్ర గాయాలు అవ‌గా అత‌న్ని చికిత్స నిమిత్తం కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం అత‌న్ని ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కాగా ఉస్మానియా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ శ్రీ‌నివాస్ బుధ‌వారం ఉద‌యం 8.30 గంట స‌మ‌యంలో మృతి చెందాడు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here