గంగారంలో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని వెంట‌నే సీజ్ చేయాలి: క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ గంగారంలో అనుమ‌తులు లేకుండా భారీ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, స‌ద‌రు నిర్మాణాన్ని వెంట‌నే కూల్చివేయాల‌ని కోరుతూ సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (సీఎంసీ) మియాపూర్ స‌ర్కిల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌కు జ‌నం కోసం సంస్థ అధ్య‌క్షుడు క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి సోమ‌వారం ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గంగారంలోని 3-41 అనే ఇంటి నంబ‌ర్‌లో ఎలాంటి అనుమ‌తులు లేక‌పోయినా, సెట్ బ్యాక్‌, అగ్నిమాప‌క నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నార‌ని అన్నారు. భ‌వ‌నం 5వ అంత‌స్తుపై అతి ప్ర‌మాద‌క‌రంగా రెండు భారీ షెడ్లు నిర్మిస్తున్నార‌ని, గ‌తంలో నిర్మాణ అనుమ‌తులకు స‌ద‌రు బిల్డ‌ర్ ద‌ర‌ఖాస్తు చేయ‌గా, అధికారులు తిర‌స్క‌రించార‌ని, అయితే ఇప్పుడు ఎవ‌రి స‌హ‌కారంతో వారు ఆ నిర్మాణాల‌ను చేప‌డుతున్నారో స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అన్నారు. అధికారులు భారీ ఎత్తున బిల్డ‌ర్ నుంచి లంచం తీసుకుని నిర్మాణాల‌ను చూసీ చూడ‌న‌ట్లు వదిలేస్తున్నార‌ని ఆరోపించారు. ఓ బ్రోక‌ర్ స‌హాయంతో 40 ఫ్లాట్స్‌కు అనుమ‌తి లేకుండా బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం చేప‌ట్టార‌ని, క‌నీస నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని, దీని వ‌ల్ల భవిష్య‌త్తులో ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అన్నారు. అందువ‌ల్ల భ‌వ‌నాన్ని వెంట‌నే సీజ్ చేయాల‌ని, విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం కూల్చివేత‌లు చేయాల‌ని, బిల్డ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here