శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.