ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ మాతృశ్రీ నగర్ అపర్ణ ఓర్చిడ్స్ వద్ద హెచ్.ఎం.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి జీఎం బ్రిజేష్, మేనేజర్ పూర్ణేశ్వరీ, కాలనీ సభ్యులతో కలిసి కైదమ్మ కుంట వద్ద ఏర్పడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.

మాతృశ్రీ నగర్ అపర్ణ ఓర్చిడ్స్ వద్ద నెలకొన్న సమస్యను అడిగి తెలుసుకుంటున్న జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యకు త్వరలోనే పైప్ లైన్ పనులను చేపట్టి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అపర్ణ ఓర్చిడ్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here