నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్య కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం… ప్రేమ్ నగర్ లో అలీ హుస్సేన్ (35) భార్య రుస్తానా బేగం, తన ఇద్దరు పిల్లలు (కుమారుడు, కూతురు)తో కలిసి నివాసం ఉంటున్నాడు. అక్బర్ హుస్సేన్ 20వ తేదీ అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్యతో గొడవ పడ్డాడు. అలీ హుస్సేన్ గొడవ పడడంతో పాటు కొట్టడంతో తట్టుకోలేకపోయిన రుస్తానా బేగం.. తన చున్నీతో మెడకు బిగించి హత్య చేసింది. అయితే అలీ హుస్సేన్ సోదరుడు అక్బర్ హుస్సేన్ 20వ తేదీన ఉదయం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి ఉన్నాడు.
అలీ హుస్సేన్ పెద్ద కూతురు జరిగిన విషయాన్ని తనకు చెప్పడంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. తానే చంపేసినట్లు రుస్తానా బేగం ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేసిన కోర్టుకు తీసుకెళ్లారు.