వైద్యులకు అండగా నిలబడతాం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

  • జూనియర్ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గాంధీకి హోలిస్టిక్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ల వినతి

నమస్తే శేరిలింగంపల్లి : కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజాంపేట్ రోడ్డులోని హోలిస్టిక్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కోల్ కతాలో వైద్యురాలిపై అత్యాచారం హేయమని, తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రాణాలు పొసే వైద్యులకు రక్షణ లేకపోవడం చాలా బాధాకరమని, సమాజంలో కనబడే దేవుళ్ళు డాక్టర్లు అని, ఎంతో మందికి ప్రాణాలు పొసే ప్రాణ దాతలని, వైద్యులకు అండగా నిలబడతామన్నారు. తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరికి నేర్పించాలని, తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదని, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

జూనియర్ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గాంధీకి వినతి పత్రం అందిస్తున్న హోలిస్టిక్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ల వినతి

కోల్ కతా ఘటన అత్యంత దారుణమని విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిని అత్యాచారం చేసి, క్రూరంగా హత్య చేయడం తనని కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యుల భద్రత మనందరి భాద్యత అని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో హోలిస్టిక్ హాస్పిటల్ సిబ్బంది, సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here