- సమీక్షా సమావేశంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈఈ దుర్గ ప్రసాద్ తో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు.
పెండింగులో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ ని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, మన్నే రమేష్, రాజు, నరసింహ, మని పాల్గొన్నారు.