నమస్తే శేరిలింగంపల్లి : పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో “శ్రీ వైష్ణవి గోపరాజు” అన్నమ స్వరార్చనతో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి భక్తితో నివేదించింది. “దేవ దేవం భజే, రామ చంద్రుడితడు, తలచినవన్నియు, తిరో తిరో, రాజీవ నేత్రాయ, నారాయణతే నమో, గోవిందాశ్రిత గోకుల, నగవులు నిజమని, ఎంత మాత్రమున, శరణు శరణు” అనే సంకీర్తనలకు అన్నమ స్వరార్చన చేసింది.
ఈ కార్యక్రమానికి కీబోర్డు – గురు ప్రసాద్, మృదంగం – రామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. తదనంతరం, శోభారాజు అన్నమయ్య సంకీర్తనకు విశ్లేషణ చేశారు. చివరిగా శోభారాజుచే కళాకారులందరికి సంస్థ జ్ఞాపికను బహుకరించారు. శ్రీ అన్నమాచార్య సహిత శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళహారతి, ప్రసాద వితరణతో అన్నమ స్వరార్చన ముగిసింది.